అంటార్కిటికాలోని పర్యాటకులు కెమెరాలో బంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్షణంఆలో ఒక తిమింగలం నోట్లో ఆహరం కావాల్సిన ఒక పెంగ్విన్ పర్యాటకులు నిండి ఉన్న పడవ పైకి దూకి తృటిలో తప్పించుకుంటోంది. మాట్ కార్స్టన్ అనే వ్యక్తి తన భార్య అన్నాతో కలిసి అంటార్కిటికా కొన దగ్గర ఉన్న గెర్లాచే జలసంధిలోని వారి డింగీ నుండి తిమింగలాలు చూస్తుండగా, ఒక పెంగ్విన్ నీటిలోపలి నుండి పైకి గెంతులు వేస్తూ తిమింగలాల నుండి తప్పించుకోవడానికి కష్టపడుతోంది.
ఆ సమయంలో పెంగ్విన్ నీటి నుండి ఒక్క ఎగురు ఎగిరి పడవ వైపు దూకింది. అది పడవ దగ్గరగా రావడంతో వెంటనే అందులో పర్యాటకులు దానిని లోపలి లాక్కుని కాపాడారు. తిమింగలాలు కొంత దూరం ఆ పడవను అనుసరించాయి, కాని చివరికి వదిలి వేసాయి. ఇక ఆ పెంగ్విన్ విషయానికొస్తే, నీటిలో మళ్ళీ దూకడానికి ముందు పర్యాటకులతో కొద్ది సేపు అది కూడా ప్రయాణించింది.