ఆంధ్రప్రదేశ్ లో స్పందన కార్యక్రమం ఇప్పుడు విజయవంతంగా అమలు జరుగుతుందని ప్రజలే స్వయంగా చెప్పడం ప్రభుత్వానికి మరింత హుషారు ఇస్తుంది. గత ప్రభుత్వంలో తమ సమస్యలు చెప్పుకున్నా అవి పరిష్కారం అయ్యేవి కాదని, కనీసం ఆ సమస్యలను వినే నాధుడే ఉండే వాడు కాదని అలాంటిది ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత ప్రభుత్వం దగ్గరవుతూ సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకి అడుగు వేస్తుందని అంటున్నారు. క్షేత్ర స్థాయిలోకి ఈ కార్యక్రమం వెళ్ళడం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతను పెంచుతుంది.
ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో అధికార యంత్రాంగం వేగంగా పని చేస్తుంది. రాజకీయాలను పక్కన పెట్టి పనులు జరుగుతున్నాయి. ప్రజల నుంచి వచ్చే ఆర్జీలను తొలి నాళ్ళలో పరిష్కరించని అధికారులు ముఖ్యమంత్రి జగన్ క్లాస్ తీసుకోవడంతో దారిలోకి వచ్చారు. ఇప్పుడు అర్జీలు రాగానే సమస్య ఏంటి అనేది తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా పించన్ అందని వారికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని లబ్దిదారులే స్వయంగా అంగీకరిస్తున్నారు.
పలానా సమస్య ఉందని స్పందన కార్యక్రమం ద్వారా తెలియజేసిన వెంటనే ప్రభుత్వం నుంచి వేగంగా స్పందిస్తూ ఆ సమస్యను పరిష్కరించేందుకు గాను ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఇక మారు మూల గ్రామాలకు సైతం ఈ స్పందన కార్యక్రమం వెళ్ళింది. దీనితో ప్రజలు ఇప్పుడు అధికారుల చుట్టూ తిరగడం కంటే స్పందన ద్వారా తెలియజేస్తే మంచిది అనే అభిప్రాయంలో ఉన్నారు. ప్రజాసమస్యలపై ‘స్పందన’కు వచ్చే అర్జీల విషయంలో అర్జీదారుడు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలని జగన్ ఆదేశించడంతో అధికారులు అలసత్వం ప్రదర్శించడం లేదు.