విరాట్ కోహ్లీ వీడియో..హెల్మెట్ ఆప్షనల్ కాదు అత్యవసరం : HYD ట్రాఫిక్ పోలీస్

-

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు టెక్నాలజీని బాగా అడాప్ట్ చేసుకుంటున్నారు. ప్రతిచిన్న సంఘటనలను తమకు తోచిన విధంగా అడాప్ట్ చేసుకుని వాహనదారులకు హెల్మెట్ వాడకం గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా విరాట్ కోహ్లీ IPLలో బ్యాటింగ్ చేస్తున్న వీడియోను HYD ట్రాఫిక్ పోలీసులు తమ X హ్యాండిల్‌లో పోస్టు చేశారు. ‘మీ తలలో విడిభాగాలు లేవు. అది గ్రౌండ్ అయినా, రోడ్ అయినా.. హెల్మెట్ ఆప్షనల్ కాదు.. బతకడానికి అవసరం’ అని రాసుకొచ్చారు. ప్రమాదంలో తలకు గాయాలైతే బతికించడం కష్టం అని తెలిపారు. రోడ్డుపై ప్రయాణించే వారు ఈ విషయాన్ని తప్పక పాటించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news