గత ఐదేళ్లు ఏపీలో సాగించిన అరాచక పాలనతో వైసిపి బీభత్సం సృష్టించింది.దీంతో ఆ పార్టీ ఎన్నికల ఫలితాల్లో కనీవిని ఎరగని రీతిలో ఓటమి పాలయింది.వైఎస్ జగన్ నియంతృత్వ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడుతూ.. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమికి పట్టం కట్టారు.దీంతో కూటమి దెబ్బకు వైసిపి పార్టీ అడ్రస్ లేకుండా పోయింది.ఎన్డీఏ కూటమిలోని టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 చోట్ల విజయం సాధించాయి.
వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. 175 సీట్లకు గాను ఎన్డీయే కూటమి 164 సీట్ల అఖండ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇక తాజా ఎన్నికల ఫలితాలపై వర్ల రామయ్య స్పందించారు.మాజీ ముఖ్యమంత్రి జగన్ వైఖరి వల్లే ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిందని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య విమర్శించారు. వైఎస్ జగన్ చేసిన అరాచకాలే ఆ పార్టీని నాశనం చేశాయని చెప్పారు. ‘బటన్లు నొక్కినంత మాత్రాన మీరు చేసిన నేరాలు-ఘోరాలు ప్రజలు మర్చిపోరు అని విమర్శించారు. వైసీపీ పాలనలో దళితులపై దాడులు, అరాచకాలు పెరిగిపోయాయి. అందుకే ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు అని అన్నారు. ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకోకుండా ప్రజలపై నిందలు వేస్తున్నారు’ అని ఆయన జగన్ పై మండిపడ్డారు.