ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీ కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితమై ఓటమిని మూటగట్టుకుని అధికారం కోల్పోయింది. ఈ క్రమంలోనే జగన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.ఇక వైసీపీ ఓటమి అనంతరం ప్రభుత్వంలో చకా చకా బదిలీలు జరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సెలవులపై వెళ్లగా..ఆంధ్ర ప్రదేశ్ నూతన సీఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు.
ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగానే, తాజాగా మరో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ పేషీలో పని చేసిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, సెక్రటరీ రేవు ముత్యాలరాజు, అడిషనల్ సెక్రటరీ నారాయణ భరత్ గుప్తాలను ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేస్తూ…సీఎస్ సౌరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వలు జారీ చేశారు. ముగ్గురని సాధారణ పరిపాలన శాఖ (జీడీఏ)లో రిపోర్ట్ చేయాలని ఆయన ఆదేశించారు. తాజాగా ఈ ముగ్గురి అధికారల బదిలీతో వైఎస్ జగన్ పేషీ ఖాళీ అయ్యింది.