బిగ్ బాస్ చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ చేసిన వైద్యులు..!

-

సాధారణంగా కొన్ని కొన్ని సర్జరీలు చేయడం డాక్టర్లకు ఎంతో సవాళ్లతో కూడుకున్న పని అన్న విషయం తెలిసిందే. ఇటీవల ఇలాంటి తరహా సర్జరీ చేసి విజయవంతమయ్యారు డాక్టర్లు. గుంటూరు జిల్లా పెదకూరపాడు కు చెందిన వరప్రసాద్ అనే వ్యక్తికి బ్రెయిన్ లో రేడియేషన్ ద్వారా కణతి తొలగించారు. ఆ తర్వాత అతని ఆరోగ్యం సాధారణంగా మారిపోయింది. కానీ గత ఆరు నెలల నుంచి మళ్లీ ఫిట్స్ వస్తూ ఉండటంతో ఆ వైద్యునికి సంప్రదించగా.. బ్రెయిన్ లో మళ్ళీ కణతి పుట్టుకొచ్చిందని గుర్తించారు ఇక ఈ సారి సర్జరీ చేయాలని భావించారు

అయితే సర్జరీ చేసేటప్పుడు బ్రెయిన్ పనితీరును సమీక్షిస్తూ సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా జరిగినా ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. అందుకే ఏకంగా పేషెంట్కు బిగ్ బాస్ షో చూపిస్తూ సర్జరీ చేశారు డాక్టర్లు. దీంతో మెదడు యొక్క పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సర్జరీ విజయవంతంగా పూర్తి చేయడంతో అతను ఎంతో ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version