దేశంలో కరోనా మహమ్మారి విలయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది ఈ కరోనా బారిన పడి మృతి చెందారు. ఇక ఈ కరోనా కట్టడికి దేశంలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ ఈ విషయంలో కీలక ముందడుగు వేసింది. ముక్కు ద్వారా వేసే వ్యాక్సింగ్ క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.
భారత్ బయోటెక్ రెండోదశ క్లినికల్ ట్రయల్స్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వగా తాజాగా భారతదేశంలో తొలిసారిగా ముక్కు ద్వారా కరోనా వ్యాక్సిన్ ను భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తోంది. ఈ కాటు తొలిదశలో 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వారిపై నాసల్ వ్యాక్సింగ్ క్లినికల్ ట్రయల్స్ పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ ట్రయల్స్ కు కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాగా దేశం లో ప్రతి రోజు 40 వలకు చేరువలో కేసులు నమోదవుతున్న సనగతి తెలిసిందే.