దళిత బంధు అమలు పై తెలంగాణ సీఎం కెసిఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 16 నుండి దళిత బంధు అమలు అమలు చేయాలని సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గం లో దళిత బంధు పథకం అమలుకు ప్రభుత్వం రూ. 500 కోట్లు మంజూరు చేసింది తెలంగాణ సర్కార్.
అంతేకాదు హుజూరాబాద్ నియోజకవర్గం లో పైలట్ ప్రాజెక్టు గా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయబోతోంది. సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో మొదట దళిత బంధు పథకాన్ని ప్రారంభిచ్చారు. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకం అమలు చేయాలని సర్కార్ ఆలోచన చేస్తోంది. ఈ దళిత బంధు పథకం ప్రకారం ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిచ నుంది తెలంగాణ సర్కార్. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలోనే దళిత బంధు తీసుకొస్తున్నారని ప్రతి పక్షాలు మండి పడుతున్నాయి.