చంద్రబాబు హెల్త్ బులెటిన్ కోసం కోర్ట్ లో పిటీషన్…!

-

స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్న చంద్రబాబు నాయుడును ఎలాగైనా విడుదల చేయించాలని మద్దతుదారులు అంతా మూకుమ్మడిగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అన్నీ బెడిసి కొడుతున్నాయి. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం చంద్రబాబు జైలులో సంతోషంగా మరియు ఆరోగ్యంగా లేరని బలంగా కుటుంబ సభ్యులు మరియు టీడీపీ నేతలు నమ్ముతున్నారు. గత వారంలో అలర్జీ రావడంతో డాక్టర్లు టెస్ట్ చేసి ఏమీ లేదని అంత బాగుందని చెప్పినా వినకుండా కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తుండడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అందుకే ప్రస్తుతం చంద్రబాబు ఏ విధంగా ఉన్నారని చెప్పాలంటూ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఒక ప్రకటన చేయాలంటూ విజయవాడ ఏసీబీ కోర్ట్ లో పిటీషన్ వేయడం జరిగింది.

ఈనెల 12వ తేదీ తర్వాత చేసిన పరీక్షల వివరాలను మాకు ఇవ్వలేదని పిటీషన్ లో పొందుపరిచారు. ఈ కారణంగా రేపు చంద్రబాబు విజయవాడ ఏసీబీ కోర్ట్ లో వర్చ్యువల్ గా హాజరు కానుండగా ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version