BREAKING: ముగిసిన కిలారు రాజేష్ సిఐడి విచారణ… అడిగిన ప్రశ్నలివే !

-

స్కిల్ స్కాం కేసులో అనుమానితులుగా భావిస్తున్న అందరికీ సిఐడి విచారణ చేస్తూ మరింత సమాచారాన్ని మరియు ఆధారాలను సేకరించే పనిలో పడింది. అందులో భాగంగా ఈ రోజు ఉదయం నారా లోకేష్ సన్నిహితుడు అయిన కిలారు రాజేష్ ను సిఐడి పోలీసులు విచారణ చేసిన విషయం తెలిసిందే. కాసేపటి క్రితమే కిలారు రాజేష్ విచారణ ముగిసినట్లుగా ఆయనే మీడియా ముందు చెప్పారు. కాగా ఈ విచారణ తమ లాయర్ ఎదురుగానే జరిగినట్లు కిలారు రాజేష్ తెలియచేశారు. కాగా ఈ విచారణలో కిలారు రాజేష్ ను మొత్తం ప్రశ్నలను అడిగారట. ఈ ప్రశ్నలలో 10 మాత్రం స్కిల్ డెవెలప్మెంట్ కేసుకు సంబంధించి అడిగారని, మిగిలిన 15 ప్రశ్నలు నా వ్యక్తిగత జీవితం గురించి అడిగారని కిలారు రాజేష్ చెప్పారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పినట్లు కిలారు తెలిపారు.

కాగా మళ్ళీ రేపు కూడా విచారణకు హాజరు కావాలని రాజేష్ కు చెప్పినట్లు తెలుస్తోంది. మరి రేపు ఎన్ని ప్రశ్నలు అడుగుతారు ? అసలు కిలారు రాజేష్ ప్రమేయం ఉందని తెలిపే ఆధారాలను ఏమైనా సాధించారా? చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version