బ్రేకింగ్; పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం భారీగా పెంపు…!

-

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ .3 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ డిమాండ్ తగ్గింది. దీనితో పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 2 రూపాయలకు పైగా తగ్గించిన రోజుల వ్యవధిలో మరోసారి మూడు రూపాయల సుంకాన్ని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై ప్రత్యేక ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 2 నుండి రూ.8కి పెంచగా…

డీజిల్‌కు రూ .4 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే… పెట్రోల్‌పై రోడ్ సెస్‌ను లీటరుకు రూ.1, డీజిల్‌కు రూ .10 పెంచింది. మార్చి 11 న పెట్రోల్ ధరను 2.69 తగ్గించారు. దీనితో లీటర్ పెట్రోల్ ధర 70.29కి చేరుకుంది. డీజిల్ ధర విషయానికి వస్తే… రూ. 2.33 తగ్గించడం తో 63.01 రూపాయలకు దిగి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ దెబ్బకు ముడి చమురు ధరలు తగ్గుతూ వస్తున్నాయి.

అంతర్జాతీయ ముడి చమురు ధరలు గత ఆదివార౦ అర్ధరాత్రి భారీగా పడిపోయాయి. ఒపెక్ దేశాల కూటమి విచ్చిన్నం అయిన అనంతరం చమురు ధరలు 31 శాతం పడిపోయాయి. కాగా కరోనా వైరస్ దెబ్బకు ఇప్పటికే అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. భారత్ సహా కీలక దేశాల ఆర్ధిక వ్యవస్థ కరోనా దెబ్బకు విలవిలలాడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version