టీడీపీ నుంచి మరో 10 మంది ఎమ్మెల్యేలు జంప్ ..!

-

ఆంధ్రప్రదేశ్ లో బలహీనంగా ఉన్న టీడీపీకి మరో పది మంది ఎమ్మెల్యేలు ఊహించని షాక్ ఇస్తారా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి, చీరాల ఎమ్మెల్యే కరణ౦ బలరాం జగన్ కి జై కొట్టారు. వీరు అధికారికంగా ఆ పార్టీలో జాయిన్ అవ్వకపోయినా సరే జై జగన్ అనడంతో ఇప్పుడు టీడీపీ ఇబ్బందుల్లో పడింది.

శుక్రవారం సాయంత్రం మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ… మరో పది మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ తీర్ధం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని అన్నారు. దీనితో ఆ పది మంది ఎవరు అనేది ఇప్పుడు టీడీపీ కార్యకర్తల్లో, రాజకీయ పరిశీలకుల్లో ఉత్కంట నెలకొంది. ఇప్పటికే చంద్రబాబు… ప్రకాశం జిల్లాలో ఉన్న మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. వీరు పార్టీ మారేది లేదని చెప్పారు.

అనంతపురం జిల్లాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ఒకరు పార్టీ మారడానికి రెడీ అయ్యారని అంటున్నారు. ఒకరు బాలకృష్ణ… ఆయన మారే అవకాశం లేదు కాబట్టి మరొకరిని టార్గెట్ చేసింది వైసీపీ. అదే విధంగా… శ్రీకాకుళం జిల్లాకు చెందిన బెందాళం అశోక్, విశాఖ జిల్లాకు చెందిన వాసుపల్లి గణేష్, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు జగన్ కి జై కొట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

అదే విధంగా గోదావరి జిల్లాలకు చెందిన ఒక ఎమ్మెల్యేతో పాటుగా… గుంటూరు జిల్లాకు చెందిన అనగాని సత్యప్రసాద్ టీడీపీ ని వీడే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. దీనితో ఇప్పుడు ఆ పార్టీలో ఎం జరుగుతుంది అనేది అందరికి ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రులు ఇప్పటికే జగన్ తో టచ్ లో ఉన్నారు. వారిని విజయసాయి రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. దీనితో ఇప్పుడు చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల మీద దృష్టి కాస్తా, దీని మీద పెట్టారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version