పెట్రోల్ డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు పెరగడంతో దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. గత నాలుగు రోజులుగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక 5వ రోజు కూడా పెట్రోల్ డీజిల్ పై ముప్పై ఐదు పైసలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా పెరిగిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 107.59 పైసలు ఉండగా… లీటర్ డీజిల్ ధర రూ.96.32 పైసలకు చేరింది.
హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ.111.91 పైసలు ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.105 వద్ద కొనసాగుతోంది. విజయవాడ లో పెట్రోల్ ధర రూ.113.52 కాగా డీజిల్ ధర రూ. 106.11గా ఉంది. పెరిగిన తాజా ధరలతో ఒక్కో రాష్ట్రంలో ఉన్న ట్యాక్స్ లను బట్టి పెట్రోల్ డీజిల్ ధరలు ఉండనున్నాయి. ఇక రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలతో నిత్యావసర ధరలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు నిత్యావసరాలు అయిన కూరగాయలు..వంట సామాగ్రి ఇతర అవసరాల పై ప్రభావం చూపిస్తున్నాయి.