పెరగనున్న జనాభా, మొబైల్ ఫోన్ నంబర్ల సంఖ్యకు అనుగుణంగానే ఇకపై మన ఫోన్ నంబర్లలో ఒక అంకెను అదనంగా చేర్చాలని ట్రాయ్ భావిస్తోంది. దీంతో ఇకపై మన ఫోన్ నంబర్లలో 10కి బదులుగా 11 అంకెలు దర్శనమివ్వనున్నాయి.
మన దేశంలో సాధారణంగా మొబైల్ ఫోన్ నంబర్లలో 10 అంకెలుంటాయన్న సంగతి తెలిసిందే. అదే ల్యాండ్‌లైన్ అయితే 11 అంకెలుంటాయి. ఈ క్రమంలోనే 10 అంకెలు ఉండే ఫోన్ నంబర్లలో కొన్ని 9తో, మరికొన్ని 8, 7, 6లతో ప్రారంభమవుతాయి. అయితే ఇకపై మన ఫోన్ నంబర్లలో ఒక అంకె అదనంగా కలవనుంది. దీంతో ఫోన్ నంబర్లలోనూ 11 అంకెలు ఉండనున్నాయి.
2050వ సంవత్సరం వరకు మన దేశంలో పెరగనున్న మొబైల్ నంబర్ల సంఖ్యకు అనుగుణంగా ఇప్పుడు మనం వాడుతున్న ఫోన్ నంబర్లలో అంకెలను 10 నుంచి 11కు పెంచాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) భావిస్తోంది. ప్రస్తుతం మనం వాడుతున్న 10 అంకెల సిరీస్‌లో 250 కోట్ల మందికి మాత్రమే సేవలందించవచ్చు. అంతకు మించితే 11 అంకెలు ఉండే ఫోన్ నంబర్లను వినియోగదారులకు ఇవ్వాల్సి ఉంటుంది.
పెరగనున్న జనాభా, మొబైల్ ఫోన్ నంబర్ల సంఖ్యకు అనుగుణంగానే ఇకపై మన ఫోన్ నంబర్లలో ఒక అంకెను అదనంగా చేర్చాలని ట్రాయ్ భావిస్తోంది. దీంతో ఇకపై మన ఫోన్ నంబర్లలో 10కి బదులుగా 11 అంకెలు దర్శనమివ్వనున్నాయి. అయితే ఏయే ఆపరేటర్లకు ఏయే అంకెలను కేటాయిస్తారనేది ఆసక్తిగా మారనుంది. మరి ఈ విషయంపై మరింత స్పష్టత రావాలంటే మరికొంత కాలం వరకు వేచి చూడక తప్పదు..!