ఫ్యాక్ట్ చెక్: పీఎం ముద్ర యోజన స్కీమ్ కింద రూ. 20,55,000…?

-

నకిలీ వార్తల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సోషల్ మీడియాలో తరచు మనకి నకిలీ వార్తలు కనపడతాయి. ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అనేది కచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఈ రోజుల్లో ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అనవసరమైన లింక్స్ మీద క్లిక్ చేయడం ఓటీపీలు చెప్పడం రహస్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని పాస్వర్డ్ ని అందరితో షేర్ చేసుకోవడం వంటి తప్పుల వలన అకౌంట్ లో నుండి డబ్బులు కట్ అయిపోతున్నాయి.

ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా నిజమైన వార్త ఏది నకిలీ వార్త ఏది అనేది తెలుసుకుని అనుసరిస్తూ ఉండాలి. చాలామంది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్ లని లేదంటే నిజంగా ఉద్యోగాలు వస్తున్నాయని మోసపోతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. మరి అది నిజమా కాదా అందులో నిజం ఎంత అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. పీఎం ముద్ర యోజన స్కీమ్ కింద 20,55,00 వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని లోన్ ని పొందచ్చని అందులో ఉంది. చాలా మంది మొబైల్ ఫోన్స్ కి ఈ మెసేజ్ ని పంపిస్తున్నారు పైగా లోన్ కి మీరు అర్హులా కాదా అని ఒక లింక్ ని కూడా ఇస్తున్నారు దీనిలో నిజం ఎంత ఇది నిజమేనా అనేది చూస్తే.. ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది మీకు ముద్ర యోజన కింద 20 లక్షల రూపాయలు వచ్చాయి అంటే నమ్మకండి ఇది వట్టి నకిలీ వార్త మాత్రమే. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించింది ఇది వట్టి నకిలీ వార్త అని తేల్చి చెప్పేసింది.

Read more RELATED
Recommended to you

Latest news