సూపర్ స్టార్ కి లక్కీ హీరోయిన్ అవుతుందా ..?

-

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం సర్కారు వారి పాట. మహేష్ బాబు కెరీర్ లో 27 వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల టైటిల్ తో పాటు రిలీజ్ చేసిన మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ కి విశేష ఆదరణ లభించింది. సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

ఇక ఈ సినిమాకి థమన్ సంగీతమందిస్తుండగా మహేష్ బాబు తో పాటు మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటించే హీరోయిన్స్ గురించి ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లోను ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. మేకర్స్ ఎవరిని ఫైనల్ చేస్తారా అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి సర్కారు వారి పాట కోసం ముగ్గురు హీరోయిన్ల పేర్లు బాగా వైరల్ అవుతున్నాయి.

భరత్ అనే నేను లో నటించిన కియారా అద్వాని నటించబోతుందని .. ఆతర్వాత కీర్తి సురేష్ …ఈ ఇద్దరు వరస సినిమాలతో బిజీగా ఉండటంతో బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ ని తీసుకున్నారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ ముగ్గురిలో ఎవరినీ ఫైనల్ చేయలేదని తాజా సమాచారం. కాని ఎక్కువగా కీర్తి సురేష్ ఎంపిక అయ్యో అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఇప్పటికే వరస సినిమాలలో నటిస్తూ తీరిక లేకుండా ఉన్న కీర్తి డేట్స్ సర్దుబాటు చేస్తుందా చూడాలి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి లో నటించింది. కాని ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. మరి సర్కారు వారి పాట తో బ్లాక్ బస్టర్ అందుకుంటుందా అని మాట్లాడుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version