ప్రస్తుతకాలంలో ఆఫీసులో కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే ఉద్యోగులందరికీ బొజ్జ(పొట్ట) పెరగడం చూస్తూనే ఉన్నాం. కూర్చుని పనిచేసేవారికి ఇదంతా కామన్ అని వదిలేస్తాం. అలా వదిలేసుకుంటే బొజ్జపెరుగుతుందని బాధపడకూడదు. లేదు తగ్గించుకోవాలనుకునేవారికి పైనాపిల్ (అనాసపండు) పండే చక్కని పరిష్కారం చూపుతుంది.
1. విటిమిన్ ఏ, బి, సిలు దాగి ఉన్న ఏకైక పండు పైనాపిల్ అని చెప్పవచ్చు. దీన్ని గనుక క్రమం తప్పకుండా 40 రోజులు తింటే బొజ్జ చూద్దామన్నా కనిపించదు. దీంతోపాటు ముఖం కూడా కాంతివంతంగా కనిపిస్తుంది.
2. పీచు, ఇనుము కలిగిన ఈ పండు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అనాసపండులోని విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. హృద్రోగాలను నయం చేస్తుంది.
3. అస్తమా ద్వారా ఏర్పడే శ్వాస సంబంధిత రుగ్మతలను తొలిగిస్తుంది. కానీ అనాసపండును మితంగా తీసుకోవాలి. పెరుగుతోపాటు అనాసపండును తీసుకోవచ్చు. అంతేకాదు జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.
4. దీన్ని సెపరేట్‌గా తీసుకోకుండా ఇతర కూరగాయలతో కలిపి సలాడ్ రూపంలోనూ డైట్‌లో భాగం చేసుకోవచ్చు. అనాసపండు తేనెతో కలిపి జ్యూస్ రూపంలో 40 రోజులు క్రమం తప్పకుండా తీసుకుంటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది.
5. అనాసపండుతో కంటి సమస్యలుండవు. చెవిపోటు, దంత సమస్యలు, గొంతునొప్పి తగ్గించే గుణం పైనాపిల్‌లో పుష్కలంగా ఉంది. ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. పచ్చకామెర్లు ఉన్నవారు అనాసపండు రసాన్ని తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
6. రక్తహీనత ఉన్నవారికి కూడా అనాస మెరుగ్గా పనిచేస్తుంది. అంతేకాదు పెయిన్‌కిల్లర్‌గా పనిచేయడంలోనూ పైనాపిల్ ముందుంటుంది. కానీ పైల్స్‌తో ఇబ్బంది పడేవారు, గర్భిణీ మహిళలు అనాసపండును తీసుకోవడం మంచిది.