త్వరలో మార్కెట్ లోకి పింక్, పసుపు టమాటోలు… సూపర్ టేస్ట్

-

ఎర్రటి పండ్లలో.. ఆపిల్ ఉంటే.. కూరగాయల్లో టమాటానే ఉంటుంది. మార్కెట్ లో మనం ఏరి కోరీ మరి.. మచ్చలు లేని ఎర్రటి టమాటాలనే తీసుకుంటాం. త్వరలో మార్కెట్ లోకి పసుపు, పింక్ కలర్ టమాటాలు కూడా వస్తున్నాయి. థాయ్‌లాండ్, మలేషియా, ఐరోపాలో ప్రసిద్ధి చెందిన పింక్ టొమాటో.. త్వరలో భారత దేశంలో కూడా రాబోతోంది.
నీటిలో కరిగే ఆంథోసైనిన్ వర్ణద్రవ్యం ఈ టమాటాలకు ఎక్కువగా ఉంది. అంతేకాదు ఇందులో క్యాన్సర్ నిరోధక గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఎరుపు టమోటాలలో పుష్కలంగా ఉన్న లైకోపీన్ పిగ్మెంట్.. ఈ పింక్ టమాటాలో తక్కువ సాంద్రతతో ఉంది. ఈ పింక్ టమాటా రకాన్ని 150-180 రోజులు సాగు చేస్తారు. 55 రోజులలో పంట చేతికొస్తుంది.. అయితే కిలోకు దాదాపు రూ. 25-30 ఖర్చవుతుంది. ఇది ప్రస్తుతం ఎర్ర టమోటా పంట ధర కంటే తక్కువే.
హైదరాబాద్ లో సాగుతున్న ఉత్పత్తి
హైదరాబాద్‌లోని వనపర్తి జిల్లా మోజర్లలోని హార్టికల్చర్ కళాశాలకు చెందిన జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్‌ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న పిడిగాం సైదయ్య (41) జెనిటిక్ పద్ధతిని ఉపయోగించి పింక్ టమోటా, పసుపు టమోటా, ఎరుపు ఉసిరికాయ, యార్డ్‌లాంగ్ బీన్స్‌ లోని మంచి విత్తన రకాలను ఉత్పత్తి చేశారు. రెండు తీవ్రమైన మేలు రకాల కలయిక కలయిక ద్వారా సృష్టించిన ఈ సంకరజాతులు సాధారణ రకాల కంటే అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయట.
జీడిమెట్లలోని హార్టికల్చర్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో విత్తనాలను పరీక్షల నిమిత్తం సమర్పించామని, త్వరలో మార్కెట్‌లో అందుబాటులోకి రానున్నాయని సైదయ్య చెప్పారు.
పింక్ టమాటా రకంలో ఒక మైనస్ ఉందట..
ఈ టమాటా స్కిన్ చాలా సున్నితంగా పలచగా ఉంటుంది. దీంతో ఈ పింక్ టమాటాలు రవాణా చేసే సమయంలో పాడయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.. అంతేకాదు నిల్వ ఉండే రోజులు కూడా తక్కువే. ఏడు రోజులు మాత్రమే వీటి జీవితం. ఈ టమాటాలు పూరీ కూర, సాంబారు, చట్నీలకు అనువైనది.
పసుపు టమాటో: 
ఈ రకంలో బీటా కెరోటిన్, ప్రొవిటమిన్ A ఎక్కువగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడానికి పనిచేస్తుంది. ఈ పసుపు టమాటాతో చేసిన వంటలు బంగారు రంగులో ఉంటాయి.. ఈ టమాటాల్లో ఎరుపు టొమాటోలలో ఉండే ఆస్కార్బిక్ యాసిడ్ లేని కారణంగా, ఈ రకం సంప్రదాయ టమోటాల కంటే బచ్చలికూరతో కలిపి వండితే మంచి రుచిగా ఉంటుంది.
– Triveni baskarowthu

Read more RELATED
Recommended to you

Latest news