ప్రో కబడ్డీ ఛాంపియన్‌గా పింక్ పాంథర్స్

-

ప్రొకబడ్డీ లీగ్ సీజన్ 9 ఉత్కంఠగా సాగింది. ఊపిరి సలపని మ్యాచ్‌లతో అభిమానులకు కావాల్సిన మజాను అందించింది. అయితే.. ప్రొ కబడ్డీ లీగ్‌(పీకేఎల్‌) సీజన్‌-9 ఛాంపియన్స్‌గా జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ నిలిచింది. శనివారం పుణేరీ పల్టన్స్‌తో జరిగిన ఫైనల్లో జైపూర్‌ 33-29తో విజయం సాధించి విజేతగా నిలిచింది. మ్యాచ్‌లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ 13 రైడ్‌ పాయింట్లతో పాటు 15 టాకిల్‌ పాయింట్లు సాధించింది. ప్రత్యర్థిని రెండుసార్లు ఆలౌట్‌ చేసిన జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ స్పష్టమైన ఆధిక్యం సాధించి ఛాంపియన్స్‌గా అవతరించింది.

ఇక పీకేఎల్‌ తొలి సీజన్‌లో విజేతగా అవరతరించిన జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ ఎనిమిది సీజన్ల తర్వాత రెండోసారి ఛాంపియన్స్‌గా నిలిచింది. ఇక ప్రొ కబడ్డీ లీగ్‌ చరిత్రలో పట్నా పైరేట్స్‌ తర్వాత రెండోసారి చాంపియన్‌గా నిలిచిన రెండో జట్టుగా జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ నిలిచింది. ఇక పట్నా పైరేట్స్‌ అత్యధికంగా మూడుసార్లు ఛాంపియన్స్‌గా నిలవడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version