ఆ వివరం ఈ కథనంలో…ఎన్నో ఆశలు ఆశయాలు కలిపి ఓ పార్టీ రూపుదిద్దకుంది. తెలంగాణ వాకిట రూపుదిద్దుకుంది. వాస్తవానికి ఆ రోజు ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా, ఆత్మగౌరవ నినాదానన్ని వినిపిస్తూ ముందుకు దూసుకు వెళ్లింది. సమైక్య పాలకులు ముఖ్యంగా ఆ రోజు ఉన్న పరిస్థితుల రీత్యా స్నేహితుల్లాంటి ఇతర పార్టీల నేతలను కూడా ధిక్కరించి వెళ్లింది. పాపం పుణ్యం ప్రపంచ మార్గం అని శ్రీశ్రీ చెప్పిన కవితా పంక్తులను చదివింది. పదండి ముందుకు పడండి తోసుకు అన్న విధంగానే ప్రవర్తించింది. అదంతా గతం అయి ఉంటుందా లేదా గత వైభవంకు పరిమితం అయి చరిత్ర పేజీలకే పరిమితం అయి ఉంటుందా అన్న సందేహాలు ఈ ప్లీనరీ వేళ రేగుతున్నాయి.
ఈ నెల 27 జరిగే ప్లీనరీనే ఆఖరి ఆవిర్భావోత్సవం అని కొన్ని లీకులు వస్తున్నాయి. కొన్ని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. కొన్ని ప్రత్యేక సందర్భాలు ఇకపై ఉండవు అని కూడా తెలియ వస్తున్నాయి. ఏదేమయినా తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెస్ లో విలీనం చేయాలన్న ప్రతిపాదనను మళ్లీ తెరపైకి తెచ్చారు ప్రశాంత్ కిశోర్ అనే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సూచిస్తున్న ప్రకారం రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనం దిశగా అడుగులు పడుతున్నాయని లీక్స్ వస్తున్నాయి. ఇవి నిజమో అబద్ధమో అని తేలేలోగా ఎన్నికలు సమీపించనున్నాయి.
గతంలో ఓ సారి తెలంగాణ రాష్ట్ర సమితి విలీన ప్రతిపాదన అన్నది తెరపైకి వచ్చింది.ఆ సందర్భంలో కేసీఆర్ తో సోనియా చర్చలు జరిపారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఎందుకనో అవి ఆగిపోయాయి. తరువాత కాలంలో రెండు దఫాలు అసెంబ్లీ ఎన్నికలను ఫేస్ చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి తిరుగులేని పార్టీ గా ఎదిగింది. ఇప్పుడు మళ్లీ విలీన ప్రతిపాదన వస్తే ఎలా ఉంటుంది అన్న తర్జన భర్జనలు నడుస్తున్నాయి. గులాబీ శ్రేణులు విలీనాన్ని ఇష్టపడతారో లేదా వ్యతిరేకిస్తారో కూడా తెలియడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ తో పొత్తునే వ్యతిరేకిస్తున్న వారు కొందరు ఇప్పుడు పొత్తు ధర్మాన్ని అంగీకరిస్తారా ? అన్న సంశయం ఒకటి రేగుతోంది. అందుకే కేసీఆర్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నది ఎవ్వరూ చెప్పలేరు అనేది ! ఒకవేళ విలీనమే షురూ అయితే తెలంగాణ జాగృతి ఏమౌతుంది అన్న డౌట్ కూడా రైజ్ అవుతోంది. ఎన్నో అవమానలను తట్టుకుని కష్టాలకు ఓర్చి పార్టీని నిలబెట్టిన ఇంకా చెప్పాలంటే గులాబీ జెండాను నిలబెట్టిన శ్రేణులు అప్పుడు ఏమౌతారు ? ఏదేమయినప్పటికీ రాజకీయాల్లో పరిణామాలను అంచనా వేయలేంప. నిన్న ఉన్న మాదిరిగా ఇవాళ ఉండదు గాక ఉండదు. అనూహ్య రీతిలో మారే పరిణామాలను చూస్తూ ఉండడమే ఓ బాధ్యత.