తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. తెలంగాణ ఎన్నికల సమయంలో.. నన్ను గెలిపించమని రేవంత్ రెడ్డి నా సహాయం కోరాడని తెలిపారు.

అలాంటి వ్యక్తి మా బీహార్ ప్రజలు లేబర్స్‌గా పని చేయడానికే పనికొస్తారని అవమానించాడని నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజల డీఎన్ఏ కన్నా.. బీహార్ ప్రజల డీఎన్ఏ చెత్తగా ఉంటుందని చెప్పుకొచ్చాడని గుర్తు చేశారు. బీహారోళ్లను అవమానించే ధైర్యం అతనికి ఎక్కడిది..? రేవంత్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.