కేరళలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఐదు లక్షలు దాటినందున ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి కె.కె.శైలజా ప్రజలకు కీలక సూచనలు చేసారు. సెప్టెంబర్ 11 న, మొత్తం రోగుల సంఖ్య లక్ష దాటింది అని… కేవలం రెండు నెలల్లోనే రోగుల సంఖ్య 5 లక్షలకు చేరుకుంది అని ఆమె వివరించారు. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 5 లక్షలు దాటినప్పటికీ, మరణించిన వారి సంఖ్య 1,771 మాత్రమే అన్నారు.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేరళ మరణాల రేటును 0.35 శాతానికి కట్టడి చేసింది అని అన్నారు. శబరిమల తీర్థయాత్ర మరియు స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్రం సిద్ధమవుతున్న తరుణంలో, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేసారు. గత 10 నెలలుగా రాష్ట్రం కోవిడ్‌తో పోరాడుతోంది అన్నారు. రాష్ట్రంలో కరోనా వచ్చిన నాటి నుంచి కూడా చాలా కష్టపడుతున్నామని, ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.