కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. కేంద్రం రైతుల కోసం కూడా కొన్ని స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. కేంద్రం తీసుకు వచ్చిన వాటిల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఒకటి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ కి సంబంధించి ఇప్పటి వరకు 13 విడతల డబ్బులు ఇచ్చింది. రూ.2,000 చొప్పున ఈ డబ్బులు రైతులు ఖాతాల్లో పడ్డాయి. ఇక ఇప్పుడు రైతుల కి ఈ స్కీము కింద ఇప్పుడు 14వ విడత డబ్బులు రావాల్సి ఉంది.
ఆ డబ్బుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి మూడు సార్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు డబ్బులు వేస్తుంది. 14 వ విడత మే నెలలో పడతాయని అంటున్నారు. ఈ 14వ విడత డబ్బులు గురించి పుకార్లు వినిపిస్తున్నాయి. మే రెండో వారంలో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకని పీఎం కిసాన్ యోజన 14వ విడత మే 3వ వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
ఆర్థిక సంవత్సరంలో 3 సార్లు విడుదల చేస్తుంది ఈ స్కీమ్ డబ్బులని. ఏప్రిల్ నుంచి జూలై వరకు ఒక విడత, ఆగస్టు నుంచి నవంబర్ కి ఇంకొకటి. డిసెంబర్ నుంచి మార్చి వరకు మూడవ విడత. లబ్ది పొందిన రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏడాదిలో మొత్తం రూ .6,000 ఇస్తుంది. కర్ణాటక ప్రభుత్వం అదనంగా మరో రెండు వాయిదాలు ఇవ్వనుంది. కర్ణాటకలోని లబ్ధిదారుల ఖాతాల్లో ఏడాదిలో రూ .10,000 జమ అవుతాయి.