ఈ పధకంలో చేరితే రైతులు రూ. 15 లక్షలు పొందొచ్చు..!

-

రైతుల కోసం ఎన్నో రకాల స్కీమ్స్ వున్నాయి. ఈ స్కీమ్స్ ద్వారా రైతులుకి ఆర్ధిక సాయం అందుతుంది. అయితే ఇప్పుడు మరొక స్కీమ్ వుంది. దీని ద్వారా కూడా రైతులకి డబ్బులు వస్తాయి. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. రైతులు వ్యవసాయం చేసుకుంటూ ఆర్థికంగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. పీఎం కిసాన్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ స్కీమ్‌ యోజనద్వారా రూ.15 లక్షలు అందించనుంది.

‘పీఎం కిసాన్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ స్కీమ్‌ యోజన’ పధకం కింద రైతులు అగ్రికల్చర్‌ బిజినెస్‌ స్టార్ట్‌ చేయడానికి మోదీ ప్రభుత్వం రూ.15 లక్షల ఆర్థిక మద్దతు అందిస్తోంది. అయితే ఈ స్కీమ్ బెనిఫిట్స్ ని పొందాలి అంటే 11 మంది రైతులు కలిసి ఒక ఆర్గనైజేషన్‌గా ఏర్పడాల్సి ఉంటుంది. అప్పుడు రూ.15 లక్షలు వస్తాయి. అలానే కంపెనీ చట్టం కింద దీనిని రిజస్ట్రేషన్‌ చేసుకోవాలి. నెక్స్ట్ వీళ్ళు ఆ డబ్బుతో విత్తనాలు, మందులు, ఎరువులు, ఇతర పరికరాలు రైతులకు విక్రయించుకోవచ్చు.

అయితే కొన్ని రోజులు ఆగాలి. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం 2023-24 నాటికి 10 వేల ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రభుత్వం ఐదేళ్లపాటు వీటికి సాయం అందిస్తుంది. ఇది ఇలా ఉంటే ఒక్కో ఎఫ్‌పీవోకు మోదీ ప్రభుత్వం రూ.15 లక్షల రుణం అందిస్తుంది. దీని ద్వారా ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేసుకొని పనులు ప్రారంభించవచ్చు. త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ ని విడుదల చేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version