కొత్త సంవత్సరం మొదటి రోజు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేటి నుంచి పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకం ద్వారా రైతులకు ఏటా రూ. 6 వేలను మూడు విడతలుగా విడుదల చేస్తుంది. ఒక్కో విడతలో రూ. 2 వేల చొప్పున రైతుల ఖాతల్లో జమ అవుతుంది. అలా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 9 విడతల పాటు రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేసింది. నేటి నుంచి 10 విడతలో భాగంగా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు నిధులను విడుదల చేయనున్నారు.
ఈ పదో విడతలో 10 కోట్లకు పైగా లబ్ధిదారులల ఖాతాలలో రూ. 20 వేల కోట్లుకు పైగా నగదు జమ కానుంది. అయితే పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయా.. లేదా అని మనం చెక్ చేసుకుకోవచ్చు. పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ కు వెళ్లాలి. దీనిలో బెనిఫీషయరి స్టేటస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీని తర్వాత మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఆధార్ కార్డు నెంబర్ అనే మూడు ఆప్షన్స్ వస్తాయి. దీనిలో ఎదో ఒక్క దాన్ని ఎంచుకుని ఎంటర్ చేయాలి. అప్పుడు పీఎం కిసాన్ డబ్బులు పడినట్లయితే.. పదో విడత అని మనకు కనిపిస్తుంది. ఒక వేళ మన ఖాతాల్లో డబ్బులు పడకపోతే.. పదో విడుత అనేది కనిపించదు.