కలలో ఇవి కనపడితే ఇక అదృష్టమేనట..!

-

ఎప్పుడూ కూడా మన కల లో ఏదో ఒకటి కనబడుతుంది. అయితే కల లో కొన్ని కనపడడం వల్ల మంచి కలుగుతుంది. అలాగే కొన్ని చెడు కి సంకేతాలు. అయితే ఈ రోజు కల లో ఏం కనిపిస్తే.. మంచి కలుగుతుంది. ఏమి కనపడితే చెడు జరుగుతుంది అనే విషయాలను చూద్దాం. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం చూసేద్దాం.

కలలో మనకి కనపడి దాని బట్టి మంచి, చెడు అనేది కలుగుతాయి. అయితే కొన్ని రకాల పక్షులు మన కలలోకి వస్తే చాలా మంచిదని శాస్త్రం అంటోంది. అలానే కొన్ని వాటి వలన చెడు కలుగుతుంది అని పండితులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా రామ చిలుక కలలో కనపడితే అదృష్టం అని పండితులు చెప్పడం జరిగింది.

రామచిలక కనుక కల లో కనబడితే ఇది చాలా మంచిది. వ్యాపారం లో అధిక లాభాలు వస్తాయి. అలానే గౌరవం పెరుగుతుంది రామ చిలక కనపడటం శుభసూచకం కూడా. సంతాన ప్రాప్తి లేని వారికి సంతానం కలుగుతుంది. అలానే ఉద్యోగులకు ప్రమోషన్లు కూడా వస్తాయి. అదే విధంగా కొంగలు, పిచుకలు, నెమలి, గరుడ పక్షి కల లో కనబడితే కూడా శుభం కలుగుతుంది. కానీ కాకి కలలో కనబడితే చెడు జరుగుతుంది అని పండితులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news