ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ పింఛను కానుక పథకంలో ఇచ్చే డబ్బులకు మరో రూ. 250 పెంచిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు రూ. 2,250 వచ్చే పింఛన్ నేటి నుంచి రూ. 2,500 రానుంది. పెంచిన పింఛను మొత్తాన్ని నేటి నుంచి రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేయనుంది. ముఖ్యమంత్రి జగన్ గుంటూర్ జిల్లాలోని ప్రత్తిపాడులో ప్రారంభించనున్నారు. కాగ ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సమయంలో వైసీపీ నుంచి జగన్.. వృద్ధులకు ఇచ్చే పింఛనును రూ. 3000 వరకు పెంచుతానని హామీ ఇచ్చారు.
దీంతో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 2000 ఉన్న పింఛనును రూ. 2,500 కు పెంచారు. అలాగే నేడు మరో రూ. 250 పెంచి రూ. 2,500 లు పింఛను ఇవ్వనున్నారు. అయితే సీఎం జగన్ ప్రత్తిపాడులో సీఎం జగన్ బహిరంగ సభలో పాల్గొని పెంచిన పింఛనును లబ్ధిదారులకు అందించనున్నారు. సభ ఏర్పాట్లను కూడా వైసీపీ నేతలు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలించారు.