మన్ కీ బాత్.. వ్యాక్సిన్ సందేహాలు.. టోక్యో ఒలింపిక్స్ పై ప్రధాని ప్రసంగం.

-

ప్రతీ నెల ప్రధాని మన్ కీ బాత్ ఆల్ ఇండియా రేడియో వేదికగా ప్రసారం అవుతున్న సంగతి అందరికీ తెలుసు. ఈరోజు ఉదయం 11గంటలకు 79వ మన్ కబాత్ కార్యక్రమం ప్రసారం కానుంది. ఇందులో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ప్రధాని ప్రసంగించనున్నారు. అందులో మొదటగా టోక్యో ఒలింపిక్స్ కి వెళ్ళిన భారత క్రీడాకారులను ఉద్దేశించి ఉండనుంది. భారత పతాక గర్వాన్ని ప్రపంచం చూసేలా చేయడానికి వెళ్ళిన వారికి, ప్రోత్సాహం అందించాలని తెలియజెప్పనున్నారు.

ఇంకా కరోనాపై సుధీర్ఘ ప్రసంగం ఉండనుందని తెలుస్తుంది. ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ విషయంలో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయనున్నారు. చాలామంది వ్యాక్సిన్ వేసుకోవడానికి సందేహిస్తున్నారు. వేసుకుంటే ఏం జరుగుతుందో అన్న భయం ఎక్కువగా ఉంది. ఆ విషయమై వ్యాక్సిన్ వలన కలిగే రక్షణ తెలియజేయనున్నారు. ఈ కార్యక్రమం ఆల్ ఇండియా రేడియోతో పాటు యూట్యూబ్ లోని ఆల్ ఇండియా రేడియో ఛానల్ లోనూ ప్రసారం కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version