కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ యాబై రోజుల్లో పదకొండు కోట్ల మంది ప్రజలకు చేరువైందని pm నరేంద్ర మోడీ అన్నారు. అర్హులైన ఏ ఒక్కరూ ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉండకూడదన్న లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నరేంద్ర మోడీ తెలిపారు. 2047 నాటికి ఇండియా ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే తన సంకల్పమని మోడీ పునరుద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వా పథకాల లబ్ధిదారులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ చాలా మంది ప్రజలకు పథకాలపై అవగాహన లేదని, వాళ్లలో చైతన్యం తీసుకొచ్చేందుకే సంకల్ప్ యాత్ర చేపట్టామని తెలిపారు. నవంబర్ 15న యాత్ర ప్రారంభించిన తర్వాత 12 లక్షల దరఖాస్తులు ఉజ్వల్ పథకానికి వచ్చాయని ప్రధాని మోడీ గుర్తు చేశారు.
సంకల్ప్ యాత్ర ప్రారంభించిన తర్వాత 22 లక్షల సికిల్ సెల్ ఎనీమియా పరీక్షలు, అలాగే దాదాపు కోటికి పైగా టీబీ పరీక్షలు నిర్వహించాం. బాధితులంతా ఎక్కువగా దళితులు, ఆదివాసీలు ఉన్నారు. పేదలకు రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా తో పాటు ఎలాంటి ఖర్చు లేకుండా డయాలసిస్ చేస్తున్నాం. తక్కువ ధరలకే మెడిసిన్స్ లభిస్తున్నాయి. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర పేదలకు వరంగా మారింది” అని ఆయన అన్నారు.