నేడు ఏపీకి మోడీ.. షెడ్యూల్‌ వివరాలు ఇవే..

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్‌లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఏపీకి బయలుదేరనున్నారు. అయితే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు మోడీ నేడు ఏపీకి వస్తున్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు మోడీ. భీమవరానికి సమీపంలోని కాళ్ల మండలం పెద అమిరంలో జరిగే భారీ బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు మోడీ. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో పాటూ ఏపీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు. భీమవరంలో ప్రధాన వేదికపై 11 మందికే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. ఉదయం 10.50 నుంచి 12.30 మధ్య ప్రసంగాలు ఉంటాయి.

PM Modi: This is the bronze statue of Alluri to be unveiled by Prime  Minister Modi .. Find out its specialties .. | PM Narendra Modi to unveil  bronze statue of Alluri

అల్లూరి, మల్లుదొర వారసులను వేదికపై ప్రధాని మోదీ సత్కరించనున్నారు. అలాగే వారితో మోదీ వ్యక్తిగతంగా భేటీ కానున్నారు. ఈ విగ్రహాన్ని క్షత్రియ పరిషత్‌ ఆధ్వర్యంలో భీమవరంలో ఏడు అడుగుల సిమెంట్‌ దిమ్మపై 30 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం తయారీకి రూ.3కోట్ల వ్యయం అయ్యిందట. పాలకొల్లు మండలం ఆగర్రుకు చెందిన అల్లూరి సీతారామరాజు అనే దాత ఈ రూ.3కోట్లు విరాళం అందజేశారు. హనుమాన్‌ జంక్షన్‌కు చెందిన శిల్పి బుర్రా ప్రసాద్‌ ఈ విగ్రహాన్ని 32 రోజులలో తయారు చేశారు. 10 టన్నుల కాంస్యం మెటీరియల్‌, 7 టన్నుల స్టీలును వినియోగించారు. అంతేకాదు దేశంలోనే అతిపెద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహంగా ఇది రికార్డులకు ఎక్కనుంది.