చిట్టితల్లికి అండగా తెలంగాణ ప్రభుత్వం

-

క్యాన్సర్‌ బారిన పడి చికిత్స పొందుతున్న చిన్నారి వేదవల్లికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అండగా నిలిచింది. మెరుగైన వైద్య చికిత్స అందించి అండగా ఉంటామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఓ ప్రకటనలో తెలిపారు. వేదవల్లి అనారోగ్యం గురించి పలు పత్రికల్లో కథనాలు రాగా ప్రభుత్వం స్పందించింది. వెంటనే ప్రభుత్వ అధికారులు ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడగా.. ఆ చిన్నారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. మంత్రి సూచన మేరకు వైద్యులు వేదవల్లి కుటుంబ సభ్యులను సంప్రదించారు. ప్రభుత్వం తరఫున ఉచితంగా చికిత్స అందిస్తామని భరోసా ఇచ్చారు.

హైదరాబాద్‌ ఎల్‌బీనగర్‌లో ఉంటున్న ఎనిమిదేళ్ల వేదవల్లికి అరుదైన క్యాన్సర్‌ సోకిన సంగతి తెలిసిందే. పలు చికిత్సల కోసం ఇంతవరకు రూ.40 లక్షలు ఖర్చు చేసిన తల్లిదండ్రులు మరో రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో దాతల కోసం ఎదురు చూస్తున్నారు. చిన్నారి పరిస్థితిని పలు పత్రికల ద్వారా తెలుసుకున్న దేశ విదేశాల్లో ఉంటున్న ఎంతోమంది మానవతావాదులు స్పందించి సాయం అందించారు. మరోవైపు ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఈ చిన్నారికి చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news