ఎమ్మెల్యే టికెట్‌పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన రాజయ్య

-

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన జనగామ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఎన్ని రూమర్స్ వచ్చినా గాబరా పడొద్దని. . బీఆర్ఎస్ తరపున టికెట్ తనదేని గెలుపు కూడా తనదేనని స్పష్టం చేశారు తాటికొండ రాజయ్య. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని సీఎం కేసీఆర్ 115 టికెట్లు కేటాయించారని రాజయ్య అన్నారు. అయితే కేటాయించిన అభ్యర్థులకు ఎక్కడా బీ ఫామ్ లు ఇవ్వలేంటూ.. నివేదికలు, సర్వే రిపోర్టుల ప్రకారం మార్పులు… చేర్పులు ఉంటాయన్నారు తాటికొండ రాజయ్య. కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ల విషయంలో అసంతృప్తి వాతావరణం ఉందన్నారు.

జనవరి 17 వరకు ఎమ్మెల్యే గా ఉంటానంటూ , ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటానన్నారు. కేటీఆర్ తో తాను మాట్లాడానంటూ బీఫాం తనకే వస్తుందని తాటికొండ రాజయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ టికెట్ రాకపోతే బరిలో నిలిచే విషయం కాలమే నిర్ణయిస్తుందన్నారు.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విదేశాలకు వెళ్లేటప్పడు తాను కలిశానని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. చాలా బాగా పని చేస్తున్నావు.. టికెట్ తనకే వస్తుందని హామీ ఇచ్చినట్లు తెలిపారు. టికెట్లు ప్రకటించే సమయంలో తాను రెండు రోజుల క్రితం కేటీఆర్ ను కలిశానని .. ఎమ్మెల్సీగా కానీ.. ఎంపీ గా కానీ అవకాశం ఉంటుందని చెప్పారన్నారు.15 రోజుల క్రితం వరంగల్ లో జరిగిన మాదిగ చమర్ ఇంటలెక్చర్స్ ఫోరంలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి పాల్గొన్నప్పుడు .. రాజయ్య కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని వచ్చిన వార్తలకు ఆయర తెరదించారు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. 2014 ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా కడియం, ఎమ్మెల్యేగా తాను అధిష్ఠానం నిర్ణయం ప్రకారం పని చేశామన్నారు రాజయ్య.

Read more RELATED
Recommended to you

Exit mobile version