రానున్న వేసవిలో మండుటెండలపై ప్రధాని మోడి “ఉన్నతస్థాయి సమావేశం” నిర్వహించారు. ఈ సందర్భంగా వడగాల్పులు, మండుటెండల పరిణామాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ సన్నద్ధత పై సమీక్షా సమావేశం నిర్వహించారు మోడీ. ఈ ఏడాది రుతుపవనాల తీరు, రబీ పంటపై ప్రభావం, ఈ వేసవి తీవ్రత పెరగడం, తగిన వైద్య సదుపాయాలపై ప్రధానికి వివరించారు అధికారులు.
ప్రజలందరికీ చాలా వివరంగా, విపులంగా ప్రతి రోజూ వాతావరణ సూచనలు విడుదల
చేయాలని వాతావరణ శాఖకు ప్రధాని మోడీ ఆదేశించారు. ఆస్పత్రుల్లో పొంచిఉన్న అగ్ని ప్రమాదాలపై సమీక్షించాలని ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో వీలైనంత ఎక్కువ ఆహార ధాన్యాలను నిల్వ చేయాలని “భారత ఆహార సంస్థ” ( ఎఫ్.సి.ఐ)కు ఆదేశాలు కూడా ఆదేశాలు ఇచ్చారు ప్రధాని మోడీ.