కరోనాను కట్టడి చేయడంలో మోదీ విఫలం

-

దేశవ్యాప్తంగా ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్‌ చేశారు. కరోనాను నియంత్రించేందుకు కేంద్రం వద్ద అసలు ఎలాంటి ప్రణాళిక లేదని అన్నారు. నరేంద్ర మోదీ ఈ విషయంలో పూర్తిగా కరోనాకు లొంగిపోయారని, కరోనాపై పోరాటం చేసేందుకు నిరాకరిస్తున్నారని అన్నారు.

కోవిడ్‌ 19 దేశంలో కొత్త ప్రాంతాల్లోనూ వేగంగా విస్తరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వద్ద కరోనాను కట్టడి చేసేందుకు ఎలాంటి ప్లాన్‌ లేదు.. అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. కరోనా పట్ల మోదీ సైలెంట్‌గా ఉన్నారు. కరోనాపై పోరాటం కూడా చేయడం లేదు.. అన్నారు. కరోనాపై అటు ఐసీఎంఆర్‌, ఇటు మంత్రులు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎలాంటి సమీక్షలు, సమావేశాలు నిర్వహించడం లేదు.. అన్నారు.

కాగా దేశవ్యాప్తంగా శుక్రవారం నాటికే కరోనా కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది. శనివారం ఒక్క రోజే 18,552 కేసులు నమోదయ్యాయి. 15,685 మంది చనిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version