అమెరికాలోనూ పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తున్న మోడీ..?

-

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ.. అక్కడి నుంచి కూడా పాకిస్తాన్ కు పరోక్షంగా చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచం దృష్టి అంతా అమెరికాలో ప్రధాని కోసం నిర్వహిస్తున్న హౌడీ మోడీ కార్యక్రమంపై ఉంది. ఈ కార్యక్రమానికి అమెరికన్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కూడా హాజరవుతున్నారు.

అయితే కాశ్మీర్ సమస్యలో వేలు పెట్టడం ద్వారా భారత్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న పాకిస్తాన్ కు అమెరికా వేదికగా అవమానం జరుగుతోంది. కాశ్మీర్ సంగతి తర్వాత ముందు మీ పాకిస్తాన్ సంగతి చూసుకోండి అని పరోక్షంగా చురకలు అంటున్నాయి పొరుగు దేశానికి.

ఎందుకంటే.. మోడీ, ట్రంప్ పాల్గొనే ‘హౌడీ మోడీ’ సభా వేదిక వద్ద పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాల ప్రతినిధులు ధర్నాలు చేస్తున్నారు. పాకిస్థాన్ చెర నుంచి తమను కాపాడాలని సింధి, బలూచ్, పస్టో సంఘాల ప్రతినిధులు భారత్- అమెరికా దేశాధినేతలను కోరుతున్నారు. ప్రపంచం దృష్టికి తమ సమస్య వెళ్లాలని భావిస్తున్న ఆయా సంఘాలు అందుకు హౌడీ మోడీ సభను టార్గెట్ చేసుకున్నారు.

అమెరికాలోని వేర్వేరు ప్రాంతాల నుంచి హ్యూస్టన్ చేరుకున్న ఈ సంఘాల ప్రతినిధులు ఇక్కడ ధర్నా చేయడం ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. పాకిస్థాన్ నుంచి స్వేచ్ఛ కల్పించాలని వీరు నినాదాలు చేశారు. బలూచ్ ప్రాంతంలో పాకిస్థాన్ ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు. సరిగ్గా పాకిస్తాన్ కూడా కాశ్మీర్ విషయంలో ఇదే తరహా ఆరోపణలు చేస్తోంది. ఇప్పుడు ఈ ప్రదర్శనల ద్వారా దాయాది దేశం పరువు అంతర్జాతీయంగా మంటగలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news