సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్..!

-

సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసారు. నాగర్​ కర్నూల్​ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ లో జరిగిన ప్రమాదంపై ఆరా తీశారు ప్రధాని. జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ప్రధాని మోదీకి వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని ప్రధానికి తెలిపారు సీఎం.

ఈ సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్​ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని ప్రధానికి వివరించారు సీఎం రేవంత్. అయితే సహాయక చర్యల కోసం వెంటనే ఎన్డీఆరెఫ్ టీం ను పంపిస్తామని సీఎంకు చెప్పారు ప్రధాని మోదీ. అలాగే ఇందుకోసం పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు ప్రధాని మోదీ. అయితే కాసేపట్లో ఎస్ఎల్ బీసీ టన్నెల్ దుర్ఘటన వద్దకు చేరుకోనున్నాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. విజయవాడ నుండి 2, హైదరాబాద్ నుండి మరో టీంతో కలిసి ప్రమాద ఘటనా స్థలికి చేరుకోనున్నాయి ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ బృందాలు.

Read more RELATED
Recommended to you

Latest news