దేశంలోని ప్రజలను కోవిడ్ బారి నుంచి రక్షిస్తున్నందుకు యావత్ 130 కోట్ల మంది భారతీయుల తరఫున డాక్టర్లకు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని ప్రధాని మోదీ prime minister modi అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ డాక్టర్స్ డే సందర్బంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు.
ప్రస్తుతం కోవిడ్‌కు వ్యతిరేకంగా భారత్ ప్రధాన యుద్ధం చేస్తుందని అన్నారు. డాక్టర్లు ఎన్నో లక్షల మంది ప్రాణాలను కాపాడుతున్నారని మోదీ అన్నారు. కోవిడ్ పై చేసిన పోరులో ఎంతో మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. వారందరీ తాను నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దేశంలో అవసరం ఉన్న చోట వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగు పరిచేందుకు రూ.50వేల కోట్లతో క్రెడిట్ గ్యారంటీ స్కీమ్‌ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. అలాగే రూ.22వేల కోట్లతో చిన్నారుల కోసం వైద్య సదుపాయాలను మెరుగు పరుస్తామని తెలిపారు.
నేషనల్ డాక్టర్స్ డే సందర్బంగా ప్రధాని మోదీ డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. వైద్య రంగంలో భారత్ అద్భుత ఆవిష్కరణలు చేసిందని మోదీ అన్నారు. ప్రపంచాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో భారత్ పాత్ర ఎంతో ఉందన్నారు.
కాగా 1991 నుంచి దేశంలో జూలై 1వ తేదీని నేషనల్ డాక్టర్స్ డే గా జరుపుకుంటున్నారు. అప్పట్లో డాక్టర్ బీసీ రాయ్ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన జయంతి రోజునే జాతీయ డాక్టర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాల ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.