మ‌త్స్య సంప‌ద యోజ‌న స్కీంను ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోదీ

-

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గురువారం ప్ర‌ధాన మంత్రి మ‌త్స్య సంప‌ద యోజ‌న (పీఎంఎంఎస్‌వై) పేరిట ఓ కొత్త ప‌థకాన్ని ఆవిష్క‌రించ‌నున్నారు. అలాగే ఈ-గోపాల అనే యాప్‌ను కూడా ఆ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆవిష్క‌రిస్తారు. పీఎంఎంఎస్‌వై ప‌థ‌కం కింద దేశంలోని మ‌త్స్య రంగానికి ఊతం ఇవ్వ‌నున్నారు. ఇందులో భాగంగా రానున్న 5 ఏళ్ల కాలంలో దేశంలో మ‌త్స్య రంగంలో కేంద్రం భారీ పెట్టుబడులు పెట్ట‌నుంది.

2020-21 ఆర్థిక సంవత్స‌రం నుంచి 2024-25 సంవ‌త్స‌రం వ‌ర‌కు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప‌థ‌కం కింద రూ.20,050 కోట్ల పెట్టుబ‌డుల‌ను పెట్ట‌నున్నారు. ఆత్మ‌నిర్భ‌ర భార‌త్ ప్యాకేజీలో భాగంగా ఈ ప‌థ‌కాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆ మొత్తం నుంచి రూ.12,340 కోట్లను ఆక్వారంగంలో పెట్టుబ‌డులుగా పెడుతారు. మ‌రో రూ.7,710 కోట్ల‌ను ఆ రంగానికి కావ‌ల్సిన మౌలిక స‌దుపాయాల కోసం పెట్టుబ‌డులుగా పెడ‌తారు.

ఈ ప‌థ‌కం వ‌ల్ల 2024-25 వ‌ర‌కు దేశంలో అద‌నంగా మ‌రో 70 ల‌క్ష‌ల ట‌న్నుల వ‌ర‌కు మ‌త్స్య సంప‌ద పెరుగుతుంది. దీంతో మ‌త్స్య‌రంగం ఎగుమ‌తుల ద్వారా రూ.1 ల‌క్ష కోట్ల‌ను ఆర్జిస్తుంది. అలాగే మ‌త్స్య‌కారుల‌కు క‌లిగే న‌ష్టాలు 25 నుంచి 10 శాతానికి త‌గ్గుతాయి. దేశంలో 55 ల‌క్ష‌ల మందికి ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఉపాధి ల‌భిస్తుంది. ఇక ఈ-గోపాల యాప్ ద్వారా రైతుల‌కు త‌మ‌కు కావ‌ల్సిన స‌మాచారం అందుతుంది. ఈ క్ర‌మంలో పీఎంఎంఎస్‌వై స్కీంతోపాటు ఈ యాప్‌ను ప్ర‌ధాని మోదీ గురువారం ఆవిష్క‌రిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version