మంత్రి ఈటల ప్రసంగం హెల్త్ బులెటిన్‌లా ఉందని, కరోనా వారియర్స్‌ను ప్రభుత్వం గుర్తు చేయకపోవడం దారుణమని ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను సిఎం కేసీఆర్ తప్పుబట్టారు. కరోనాపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా ప్రభుత్వంపై అక్బర్ చేసిన విమర్శలకు ఆయన సమాధానం ఇచ్చారు. కరోనా నియంత్రణకు మంత్రి ఈటల ఆహర్నిషలు కృషి చేశారని సీఎం కీర్తించారు.
ఎన్ని చర్యలు తీసుకున్నా రాష్ట్రంలో కరోనా ఇంకా తగ్గలేదని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా కట్టడికి స్పష్టమైన ప్రణాళి ఉండాలని, కరోనా కట్టడికి నిత్యం చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసారు. కరోనా నివారణ చర్యలన్నీ ప్రస్తావించడం సాధ్యం కాదని, కరోనా యోధులకు వేతనాలు పెంచి ఇస్తున్నామని అన్నారు. ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసారు.