ఏపీ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు…!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సంద్భంగా రాష్ట్రప్రజలకు ప్రధానమంత్రి మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని నా సోదరీమణులకు సోదరులకు శుభాకాంక్షలు అని మోడీ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు తమ నైపుణ్యం ధృడ సంకల్పం..పట్టుదలకు మారు పేరు అని వ్యాఖ్యానించారు. అందుకే వారు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అంటూ ప్రధాని అభినందించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా ఆనందంగా ఉండాలని..వారు అనేక విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను అని ప్రధాని పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రధాన మంత్రి తెలుగులో ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక ప్రధాని ట్వీట్ కు మాకు శుభాకాంక్షలు వద్దు గానీ స్పెషల్ స్టేటస్ ఇవ్వండి అంటూ కామెంట్ లు పెడుతున్నారు. అదే విధంగా కేరళ తో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈరోజు అవతరణ దినోత్సవం జరుపుకుంటూ ఉండటం తో ఆ రాష్ట్రాల ప్రజలకు కూడా ప్రధాని వారి భాషల్లోనే శుభాకాంక్షలు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news