ప్రధాని మోడీ మన్ కీ బాత్.. ఆదిలాబాద్ కుకీస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు

-

ప్రధాని మోడీ ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ ప్రసంగంలో ఆదిలాబాద్‌ ఆదివాసీ మహిళలు తయారు చేసే మహువా కుకీస్(ఇప్పపువ్వు లడ్డూ) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘ఆదివాసీ మహిళలు తయారు చేసే మహువా కుకీస్‌కు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇద్దరు సోదరీమణులు మహువా పువ్వులతో కొత్త ప్రయోగం చేశారు. వారు వీటితో వివిధ రకాల వంటకాలు చేస్తారు. వీటిని ప్రజలు చాలా ఇష్టపడతారు.

వారి వంటలలో ఆదివాసీ సంస్కృతి మాధుర్యం కూడా ఉంది’ అని ప్రధాని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఏపీలోని అరకు కాఫీని ప్రధాని మరోసారి ప్రశంసించారు.‘అరకు కాఫీ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇది ఏపీ రైతుల కష్టానికి నిదర్శనం’ అని వెల్లడించారు. కాగా, మోడీ మన్ కీ బాత్‌ను తెలంగాణ బీజేపీ ఆఫీసులో రాష్ట్ర నేతలు వీక్షించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version