రేపు వరంగల్‌కు ప్రధాని మోడీ.. ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా..

-

ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నారు. ఈ నెల 8న రాష్ట్రానికి వస్తారు. ప్రధాని వరంగల్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. శనివారం ఉదయం హకీంపేట్ ఎయిర్ పోర్టుకు ప్రధాని మోదీ చేరుకుంటారు. హకీంపేట్ నుంచి హెలికాప్టర్ లో వరంగల్ కు వెళ్తారు. అనంతరం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లోనే శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ పక్కనే బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు.

మోదీ టూర్ సందర్భంగా వరంగల్, హనుమకొండ నగరాల్లో ట్రాఫిక్ మళ్లింపుతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు చెప్పారు. హైదరాబాద్, ఖమ్మం, హుజురాబాద్, ములుగు ప్రాంతాల నుండి వచ్చే వాహనదారులు తాము సూచించిన మార్గాల్లో ప్రయాణించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ కోరారు. హైదరాబాద్, ఖమ్మం నుండి వచ్చే వాహనాలు పైన సూచించిన మార్గాల మీదుగా చేరుకోవాల్సి ఉంటుంది.

 

హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జరిగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిరంగ సభకు వచ్చే వాహనాలు ఈ మార్గాల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. హుజురాబాద్ వైపు నుండి వచ్చే వాహనాలు కేయూసీ జంక్షన్, 100 ఫీట్ల రోడ్ మీదుగా సెయింట్ పీటర్ ఫార్మసీ కాలేజ్, అంబేద్కర్ భవన్, గోకుల్ జంక్షన్ మీదుగా సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద ప్రజలను దించిన తర్వాత ఖాళీ వాహనాలను ఇదే మార్గంలో తిరిగి వెళ్లి కేయూసీ ఎస్.డీ.ఎల్.సీ.ఈ మైదానంలో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version