పీఎం ప్రణామ్: అన్నదాతలకు గుడ్ న్యూస్.. కేంద్రం నుండి కొత్త స్కీమ్… ‘పీఎం ప్రణామ్’ లక్ష్యం ఇదే..!

-

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వస్తూనే వుంది. కేంద్రం అందించే స్కీమ్స్ వలన చాలా మంది ప్రయోజనాన్ని పొందుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం లోని కేంద్ర సర్కార్ రైతుల కోసం ఇప్పుడు ఓ కొత్త పథకాన్ని తీసుకొస్తోంది. ఇక మరి దీని కోసం పూర్తి వివరాలని చూసేద్దాం..

farmers

ప్రధాన మంత్రి ప్రణామ్ స్కీమ్‌గా పిలిచే ఈ స్కీము జూన్ 14న జరిగే మంత్రి వర్గ సమావేశంలో ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కేంద్ర కేబినెట్, ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశం తర్వాత పీఎం ప్రణామ్ స్కీమ్‌కు ఆమోదం లభించచ్చు. ఒకవేళ ఇది లభిస్తే ప్రమోషన్ ఆఫ్ ఆల్టర్నేట్ న్యూట్రియంట్స్ ఫర్ అగ్రికల్చర్ మేనేజ్‌మెంట్ యోజన స్కీమ్ రైతుల కోసం అందుబాటులోకి వస్తుంది.

పీఎం ప్రణామ్ స్కీమ్ ప్రధాన లక్ష్యం ఇదే…

బయో ఎరువులు, సేంద్రీయ ఎరువుల తో కలిపి ఎరువుల సమతుల్య వినియోగాన్ని ప్రోత్సహించడమే ఈ పీఎం ప్రణామ్ స్కీమ్ ప్రధాన లక్ష్యం. ప్రణామ్ స్కీమ్ ద్వారా కేంద్ర సర్కార్ రసాయన ఎరువుల సబ్సిడీ భారాన్ని తగ్గించాలని అనుకుంటోంది. సబ్సిడీ పొదుపులో దాదాపు 50 శాతం ఆదా చేసే రాష్ట్రాలకు గ్రాంట్‌ గా పంపిస్తారు. రాష్ట్రాలు ఎరువుల సబ్సిడీని పొదుపు చేసినట్లయితే ఆ రాష్ట్రాలకు గ్రాంట్ అనేది ఇస్తారు. గ్రాంట్‌లో 70 శాతం గ్రామ, బ్లాక్, జిల్లా స్థాయిలలో ప్రత్యామ్నాయ ఎరువులు వంటి వాటి కోసం వాడాలి. మిగిలిన 30 శాతాన్ని రైతులు, పంచాయతీలు, రైతు ఉత్పత్తి సంస్థలు, ఎరువుల కోసం అలానే అవగాహనా కోసం వాడాల్సి వుంది. రసాయన ఎరువులపై ఇస్తున్న సబ్సిడీ భారాన్ని తగ్గించడమే ఈ స్కీము తాలూకా ఉద్ద్యేశ్యం. ఎరువుల పై సబ్సిడీ 2022-23లో రూ.2.25 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా.

Read more RELATED
Recommended to you

Latest news