ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరికాసేపట్లో పోలవరం బయలుదేరి వెళ్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, అలాగే నిర్వాసితులు ప్యాకేజీ కి సంబంధించి కీలక సమీక్షలు జరిగే అవకాశం కనిపిస్తోంది. నిజానికి కొద్ది రోజుల క్రితం ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ తో భేటీ అయి వచ్చారు..ఈ క్రమంలో జగన్ పోలవరం పర్యటన ఆసక్తికరంగా మారింది.
పోలవరం ప్రాజెక్టు పనులు ఎంత వరకు వచ్చాయో జగన్ స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం అక్కడే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు .అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించడం ఇది మూడోసారి. ఈ ఏడాది ఫిబ్రవరిలో లాక్ డౌన్ కు ముందు చివరి సారి సీఎం ప్రాజెక్టును ప్రత్యక్షంగా పరిశీలించారు. కేంద్ర మంత్రి షెకావత్ కూడా 15 రోజుల్లో పోలవరం ప్రాజెక్టు సందర్శిస్తానని చెప్పటం….సీఎం జగన్ పర్యటనతో పనులు ఊపందుకుంటాయనే ఆశాభావం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది.