పోలవరం నిర్మాణంలో మరో అరుదైన రికార్డు సాధనకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. స్పిల్ ఛానల్‌లో రికార్డు స్థాయిలో కాంక్రీట్ వేసేందుకు చేపట్టిన 24 గంటల పనులు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ పనులు సోమవారం ఉదయం 8 వరకు ఈ పనులు కొనసాగనున్నాయి. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో దీన్ని నమోదు చేసేందుకు ఆ సంస్థ ప్రతినిథి విశ్వనాథ్ సమక్షంలోనే పనులకు శ్రీకారం చుట్టారు. దుబాయ్‌లో గతంలో నమోదైన రికార్డును అధిగమించేందుకు 24 గంటల్లో 30వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసేందుకు ఏర్పాటు చేశారు.
దుబాయ్‌లోని ఓ టవర్ నిర్మాణం సందర్భంగా 2017 మే లో 36 గంటల్లోనే 21,580 ఘనపు మీటర్ల కాంక్రీట్ వేశారని, ఇప్పుడా రికార్డును అధిగమించేందుకు 24 గంటల్లోనే 30 వేల ఘ.మీ. కాంక్రీట్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు వెల్లడించారు.