లక్షకు నాలుగు లక్షలు.. నకిలీ నోట్ల ముఠా అరెస్ట్..!

-

హనుమకొండ జిల్లాలో నకిలీ నోట్లను విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేసారు పోలీసులు. ఒక లక్షకు నాలుగు రెట్లు అధికంగా నకిలీ నోట్లు అందజేస్తామని నకిలీ నోట్ల వియ్రాలకు పాల్పడతున్న ఎనిమిది మంది ముఠా సభ్యులను కేయూసి పోలీసులు అరెస్టు చేసారు. వీరి నుండి భారీ మొత్తంలో అసలు వోట్లు 34లక్షల 84వేల రూపాయలతో పాటు, 21లక్షల రూపాయల నకిలీ నోట్లు, నకిలీ నోట్ల ముద్రణకు అవరమైన తెల్లకాగితాలు, ఒక కారు, ఆటో, తొమ్మిది సెల్ఫోన్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇక పోలీసులు అరెస్టు చేసిన వారిలో.. మణికాల కృష్ణ, 57 సంవత్సరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. ఎర్రగొల్ల శ్రీనివాస్ 36 సంవత్సరాలు, హనుమకొండ జిల్లా.. బిజిని వేముల వెంకటయ్య, 57 సంవత్సరాలు, కర్నూలు జిల్లా.. దరామ్సోత్ శ్రీను, 45 సంవత్సరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. తేజావత్ శివ, 34 సంవత్సరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. గుగ్గోత్ వీరన్న 26 సంవత్సరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. ఉడుతా మల్లేష్, 26 సంవత్సరాలు, హనుమకొండ జిల్లా.. ఎర్రగొల్ల అజయ్, 25 సంవత్సరాలు, హనుమకొండ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version