‘బ్రాండ్ బాబు’ పై మహిళా విలేకరి ఫిర్యాదు

-

police case filed on brand babu movie
బ్రాండ్‌ బాబు చిత్రంపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. తన ఫోటోను అనుమతి లేకుండా సినిమాలో వాడటంపై ఓ మహిళా జర్నలిస్టు పోలీసులను ఆశ్రయించింది. ఈ సినిమాలో ఓ చనిపోయిన సీన్ లో తన ఫొటోను చూపించారని, అలా తన తెలియకుండా తన ఫోటోను వాడటం తనను బాధించిందని తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు ఐపీసీ 509 సెక్షన్ కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

టీవీ సీరియల్‌ నటుడు ప్రభాకర్‌ దర్శకుడిగా తెరకెక్కించిన బ్రాండ్‌ బాబు సినిమాతో కన్నడ నటుడు సుమంత్‌ శైలేంద్ర తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానికి మారుతి కథను సమకూర్చారు.

Read more RELATED
Recommended to you

Latest news