క‌రోనా ఎఫెక్ట్: ఒంగోలులో పోలీస్ ఆత్మ‌హ‌త్య‌

-

ప్ర‌కాశం జిల్లాలో విషాదం నెల‌కొంది. ఒంగోలు సీసీఎస్‌లో హెడ్‌కానిస్టేబుల్ ఆంజ‌నేయులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. త‌న‌కు కరోనా వైర‌స్ సోకిందంటూ సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నారు. అయితే.. ఆంజ‌నేయులు కరోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకోలేదంటూ తోటిపోలీసులు చెబుతున్నారు. ఎంతో సున్నితంగా ఉండే ఆంజ‌నేయులు విధి నిర్వ‌హ‌ణ‌లో బాధ్య‌తాయుతంగా ఉంటార‌ని, ఇంత‌వ‌ర‌కూ చిన్న‌పాటి రిమార్క్ కూడా లేద‌ని అంటున్నారు. ఆంజ‌నేయులు ఏదైనా ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష చేయించుకుని ఉంటాడ‌ని పోలీస్ అధికారులు అనుమానిస్తున్నారు.

ఏది ఏమైనా హెడ్‌కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం స్థానికంగా క‌ల‌క‌లం రేపుతోంది. ఈ ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టేందుకు పోలీసు అధికారులు రెడీ అవుతున్నారు. కొన్నాళ్ల క్రితం ఆంజనేయులు కుమారుడు రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న మాన‌సికంగా కుంగిపోయిన‌ట్టు కూడా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news