కరోనా రోగులకి వైద్యం అందించడంతో పాటు వారుండే ప్రదేశాలని శుభ్రంగా ఉంచడం కూడా ముఖ్యమే. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య సిబ్బంది తమ ప్రాణాలని పణంగా పెట్టి అన్ని సేవలని అందిస్తున్నారు. ఐతే వైద్యం, ఆరోగ్యం, సేవలు.. మొదలగునవి ప్రభుత్వం తప్పనిసరిగా కల్పించాలి. కేవలం కల్పిస్తే సరిపోదు సేవలు సరిగా అందుతున్నాయా లేదా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకి ఉంటుంది. ప్రజా ప్రతినిధులు ఈ మేరకు నడుం బిగిస్తున్నట్లు తెలిసిందే.
ఐతే తాజాగా కరోనా ఆసుపత్రిలో టాయిలెట్ క్లీన్ చేసిన మంత్రి గురించి తెలిసిన వారందరూ షాక్ అవుతున్నారు. సాధారణ తనిఖీలో భాగంగా ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీకి వెళ్ళిన పుదుచ్చేరి ఆరోగ్య శాఖామంత్రి మల్లాది క్రిష్ణరావు, అక్కడి వారిచ్చిన కంప్లైంట్ గా చాలా ఫాస్ట్ గా స్పందించారు. కరోనా వార్డులో టాయిలెట్లని సరిగ్గా శానిటైజ్ చేయట్లేదని కంప్లైంట్ రావడంతో రంగంలోకి దిగి బ్రష్ తీసుకురమ్మని చెప్పి స్వయంగా తానే టాయిలెట్ క్లీన్ చేసారు. ఇది చూసినవారందరికీ షాక్ తిన్నంత పనయింది. ప్రజల గురించి ఇంతలా పట్టించుకునే పాలకులు ఉండడం జనాల అదృష్టమే.