కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు

-

నిన్న చార్మినార్ దగ్గర నిరసన తెలిపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు అయ్యింది.అధికార చిహ్నంలో చార్మినార్ తొలగింపుపై నిన్న చార్మినార్ వద్ద నిరసన తెలిపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ,నాయకులు పొన్నాల లక్ష్మయ్య, పద్మారావు గౌడ్, మాగంటి గోపినాథ్ మరియు ఇతర నాయకుల సెక్షన్ 188 కింద కేసు చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అధికారిక చిహ్నాంలో ఉన్న కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ను తొలగించి వాటి స్థానాల్లో కొత్త డిజైన్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. లోగోలో మార్పులు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.తెలంగాణ అస్థిత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ వ్యవహారిస్తోందని రాష్ట్ర లోగోలో మార్పులను నిరసిస్తూ గురువారం మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యేలు చార్మినార్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ క్రమంలోనే అనుమతి లేకుండా చార్మినార్ వద్ద ఆందోళన చేశారని కేసు నమోదు చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news